Sunday, January 19, 2025
HomeTrending NewsHMDA:గ్రీన్ కారిడార్ గా హైదరాబాద్ - వరంగల్ హైవే

HMDA:గ్రీన్ కారిడార్ గా హైదరాబాద్ – వరంగల్ హైవే

పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నది. మండు వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్ కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి అనుసంధానంగా ఉన్న నేషనల్ హైవేలు స్టేట్ హైవేల సుందరీకరణ (బ్యూటీఫికేషన్) లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కీలక పాత్రను పోషిస్తున్నది. ప్రజల మనోభావాలకు, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా భవిష్యత్తు తరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచి పోషిస్తున్నది.

వరంగల్ నేషనల్ హైవే(NH-163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” గ్రీనరీ ని జనగామ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పురపాలక శాఖను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్ ను తలపించేలా పచ్చదనాన్ని పెంచి పోషించాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖను నిర్దేశించారు.

‘‘తెలంగాణకు హరితహారం”కార్యక్రమంలో  ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), వరంగల్ నేషనల్ హైవే(NH-163)వెంట జనగామ వరకు దాదాపు రూ.15.04 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ రూపొందించిన ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తిఅయ్యాయి.

శ్రీశైలం హైవే (NH-765) వెంట శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహణ. కర్నూలు హైవే (NH-44) వెంట అరాంఘర్ నుంచి షాద్ నగర్ వరకు 25 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ హెచ్ఎండిఏ నిర్వహించింది. రాజీవ్ రహదారి స్టేట్ హైవే (SH-1) వెంట శామీర్ పేట నుంచి గజ్వేల్ వరకు దాదాపు 39 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహించింది.

హెచ్ఎండిఏ గ్రీనరీపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది.

ఇటీవల కేరళ రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారులు డిప్యూటీ కన్జర్వేటర్ హెడ్ క్వార్టర్స్ మహమ్మద్ షబాబ్, ఐఎఫ్ఎస్ (బ్యాచ్ 2011), కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సోషల్ ఫారెస్ట్రీ – కోజికోడ్) శ్రీమతి కీర్తి ఐఎఫ్ఎస్ (బ్యాచ్ 2012) వరంగల్ నేషనల్ హైవే గ్రీనరీని అధ్యయనం చేశారు. అంతేకాకుండా బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి చార్లెట్ ఎడాలిన హ్యూమన్ జియోగ్రఫీ అనే అంశంపై పిహెచ్ డి లో భాగంగా హెచ్ఎండిఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై పరిశోధన చేశారు. నాందేడ్ నేషనల్ హైవే (NH-161) వెంట హెచ్ఎండిఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్ తో పచ్చదనాన్ని పరిమళింప చేస్తున్నది. కంది క్రాస్ రోడ్స్ (చౌరస్తా) నుంచి రామ్ సాన్ పల్లె వరకు 32.77 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ 3.57 కోట్ల వ్యయంతో సెంట్రల్ మిడెన్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేసింది.

గ్రీన్ కారిడార్ గా మారుతున్న హైదరాబాద్ – వరంగల్ హైవే

రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నేపధ్యంలో వరంగల్ నేషనల్ హైవే(163) వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి  వరంగల్ హైవే వెంట గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని సూచించారు. తొలి దశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో పూర్తి అయ్యాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” వరంగల్ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి కావడంతో వరంగల్ రహదారి వెంట అకు పచ్చని అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి.

యాదాద్రి రూట్ లో హెచ్ఎండిఏ పెంచిన మల్టీ లేయర్ ప్లాంటేషన్ నేషనల్ హైవే అథారిటీ కి ఆదర్శంగా(రోల్ మోడల్)గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్(ఈస్ట్) వారణాసి నేషనల్ హైవే వెంట హెచ్ఎండిఏ తీర్చిదిద్దిన ‘‘యాదాద్రి రూట్ మల్టీ లేయర్ ప్లాంటేషన్” మోడల్ ను గతంలో నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్(ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య స్టడీ చేశారు. ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారుల బృందం యాదాద్రి నేషనల్ హైవేను పరిశీలించింది. అంతేకాకుండా బెర్లిన్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్ డి విద్యార్థి హెచ్ఎండిఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై అధ్యయనం చేయడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్