Saturday, November 23, 2024
HomeTrending Newsవిపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా

విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా

Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా.. కీలక ప్రకటన చేసిన జైరాం రమేష్.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్‌సిన్హాకు మద్దతు ప్రకటించాయి. శరద్‌పవార్‌ అధ్యక్షతన జరిగిన విపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళే తృణమూల్‌కు రాజీనామా చేశారు యశ్వంత్‌సిన్హా. విపక్షాల భేటీకి టీఎంసీ తరపున అభిషేక్‌ బెనర్జీ హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హాకు సుదీర్ఘ అనుభవం ఉంది. చంద్రశేఖర్‌ , వాజ్‌పేయ్‌ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆర్ధిక , విదేశాంగశాఖలను నిర్వహించారు.

85 ఏళ్ల యశ్వంత్‌సిన్హా బీహార్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. బీజేపీకి రాజీనామా చేసి కొద్దినెలల క్రితం ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

Also Read : రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్