Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్వేష ప్రసంగాలు సమాజానికి చేటు - యశ్వంత్ సిన్హా

విద్వేష ప్రసంగాలు సమాజానికి చేటు – యశ్వంత్ సిన్హా

హైదరాబాద్‌కు వచ్చాక ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూసినట్లుందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా తెలిపారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి నాకు మద్దతు ప్రకటించారని సిన్హా పేర్కొన్నారు. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ వివరంగా చెప్పారని పేర్కొన్నారు.

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని… ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు కాదని దేశ ప్రయోజనాలు కాపాడేందుకు జరుగుతున్న యుద్దమన్నారు. విద్వేష పూరిత ప్రసంగాలు మంచిది కాదని… ఒక వ్యక్తి చెపుతుంటే 135 కోట్ల మంది వినాల అని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. దేశానికి కేసీఆర్‌ లాంటి నేత అవసరమని అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్‌ లోక్‌సభలో గళం విప్పారని చెప్పారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా కేంద్రం విధానాలపై పోరాటం కొనసాగుతుందని యశ్వంత్ సిన్హా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్