విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల రెండో తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. యశ్వంత్ సిన్హా స్వాగత ఏర్పాట్లు మరియు ఆయనకు మద్దతుగా నిర్వహించే సభ పైన మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర మంత్రులు ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపారు. రెండవ తేదీన ఉదయం 10 గంటలకు airport చేరుకోనున్న యశ్వంత్ సిన్హా. ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని trs నిర్ణయించింది.
అదే రోజు ఉదయం 11 గంటలకి జలవిహార్ లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా సభ ఉంటుంది. స్వాగతం మరియు సభ నిర్వహణ బాధ్యతలను నగర మంత్రులు ప్రజాప్రతినిధులకు అప్పగించిన కేటీఆర్. అదే రోజు యశ్వంత్ సిన్హాతో తెలంగాణ పిసిసి నేతలు కూడా సమావేశం కానున్నారు.