Thursday, March 28, 2024
HomeTrending News‘మహా’ సిఎంగా ఏక్ నాథ్ షిండే

‘మహా’ సిఎంగా ఏక్ నాథ్ షిండే

Unexpected Move: మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఒకప్పటి ఆటో డ్రైవర్  ఈ దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో పదవి అలంకరించనున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్  కాకుండా శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. షిండేకు తమ సంపూర్ణ  మద్దతు ఉంటుందని, ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు సిఎంగా షిండే పదవీ బాధ్యతలు చేపడతారని వెల్లడించారు.  ప్రభుత్వంలో తమ పార్టీ భాగం పంచుకోవడంలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత  బిజేపిగా తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, బిజెపి తీసుకున్న ఈ రాజకీయ వ్యూహం విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. దేశ ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబైని బిజెపి తమ చేతుల్లో ఉంచుకుంటుందని, ఫడ్నవీస్ మూడోసారి సిఎంగా పదవీ చేపడతారని అందరూ ఊహించారు. వారందరి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రభుత్వానికి బైటనుంచి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో మంత్రి పదవుల పంపకం లాంటి వివాదాలు కూడా ఉండవు.

Also Read : సిఎం పదవికి ఉద్దావ్ థాకరే రాజీనామా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్