Monday, February 24, 2025
HomeTrending Newsయశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం

యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెరాస నేతలు పాల్గొన్నారు.

బేగంపేట నుంచి జలవిహార్ వరకు ర్యాలీ మొదలైంది. యశ్వంత్ సిన్హా ను తోడ్కొని,బేగంపేట విమానాశ్రయం నుండి జలవిహార్ కు భారీ ర్యాలీగా బయలు దేరిన సీఎం కేసిఆర్.. ర్యాలీ లో పాల్గొంటున్న మంత్రులు, ఎంపీ లు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భారీగా తరలి వచ్చిన టీ ఆర్ ఎస్ శ్రేణులు.

ఈ నేపథ్యంలో TRS ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అనంతరం కేసీఆర్‌తో కలిసి విందు చేయనున్నారు. కాగా నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌‌లో జరగనుండగా.. దీనికి పీఎం నరేంద్ర మోడీ కూడా హాజరు కానుండడంతో హైదరాబాద్‌ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్