Tuesday, February 25, 2025
HomeTrending NewsYSR Jayanthi: మీ స్పూర్తి నడిపిస్తోంది: వైఎస్ కు జగన్ నివాళి

YSR Jayanthi: మీ స్పూర్తి నడిపిస్తోంది: వైఎస్ కు జగన్ నివాళి

దివంగత నేత డా. వైఎస్సార్ 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి స్ప్పూర్తి  ఎల్లప్పుడూ చేయి పట్టుకొని నడిపిస్తోందని, ఇది అందరికీ పండుగ రోజని చెప్పారు.

“ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు” అంటూ తన సందేశంలో సిఎం జగన్ పేర్కొన్నారు.

తండ్రి వైఎస్ తో దిగిన ఫోటోను ఈ సందేశానికి జత చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్