Sunday, January 19, 2025
Homeసినిమాఆస్కార్ టాప్ 10 లో యంగ్ టైగర్

ఆస్కార్ టాప్ 10 లో యంగ్ టైగర్

‘ఆర్ఆర్ఆర్’.. సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ ఇది. ఓటీటీలో రిలీజైన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. ఇప్పుడు ఈ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ బరిలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ అవార్డ్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ పాటగా నాటు నాటు సాంగ్, సంగీత దర్శకుడుగా కీరవాణి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ టాప్ 10లో స్థానం దక్కించుకుని చరిత్ర సృష్టించారు.

ఇంతకీ విషయం ఏంటంటే… యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవం.. గుర్తింపు ఎన్టీఆర్ కు దక్కింది. అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ను ప్రకటించబోతున్నారు. ఈ టైమ్ లో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు..? ఏ సినిమాలు ఉంటాయి..? ఎవరికి అవార్డులు వస్తాయనే ఊహాగానాలతో కథనాలు రాస్తూ ఉంటారు. ఆ మీడియా సంస్థలు ఊహించిన వారికి.. ఆస్కారం ఉందంటూ చెప్పిన సినిమాలకే ఆస్కార్ అవార్డులు రావడం గతంలో పలు సార్లు జరిగింది.

ఈసారి ప్రముఖ వెరైటీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఉత్తమ నటులుగా ఎవరు ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తారో తెలియచేస్తూ.. పది మందితో కూడిన ఒక ఊహాజనిత జాబితాను రెడీ చేసింది. అందులో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండటం విశేషం. 2023 ఆస్కార్ అవార్డుకు పోటీ పడబోతున్న స్టార్స్ అంటూ మెహదీ బజెస్తానీ.. ఆస్టిన్ బట్లర్.. ఏడిన్ డాంబ్రైన్.. కోలిన్ ఫారెల్.. బ్రెండన్ ఫ్రెజర్… హ్యూ జాక్మన్.. బిల్ నైఘీ.. కుపర్ రైఫ్ ఇంకా విల్ స్మిత్ ల పేర్లను వెరైటీ మీడియా సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో మొదటి సారి ఇండియన్ స్టార్ చోటు దక్కించుకున్నాడు. ఆ ఇండియన్ స్టార్ ఎన్టీఆర్ అవ్వడం మనందరికీ గర్వంచదగ్గ విషయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్