Sunday, January 19, 2025
HomeTrending Newsఇక నుంచి షర్మిల ఊరు పాలేరు

ఇక నుంచి షర్మిల ఊరు పాలేరు

From Palair: ఇకనుంచి పాలేరు తన ఊరు అని తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభివర్ణించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నేడు పాలేరు కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. దీనితో షర్మిల పోటీపై  కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని,  వైఎస్సార్ అనే పేరు ఒక అస్తి అయితే దానికి అసలైన వారసులం మనమేనంటూ షర్మిల కార్యకర్తలతో వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం ఆయన బిడ్డగా నాకే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇతర వ్యక్తికి లేదా ఇతర పార్టీలకు ఆ హక్కే లేదన్నారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఈ రోజుది కాదని, తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని ఆమె వివరించారు.

పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు  కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకమన్న షర్మిల వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలని పిలుపు ఇచ్చారు. అత్యధిక మెజారిటీ కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు. ‘ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు’ అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్