Wednesday, September 25, 2024
HomeTrending Newsపెన్షన్లపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు - పొన్నాల విమర్శ

పెన్షన్లపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు – పొన్నాల విమర్శ

రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి చెందాలని యజ్ఞం చేసింది రాజశేఖర్ రెడ్డి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వైఎస్ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్,  పంజాగుట్టలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి చూస్తుంటే అభివృద్ధి లేదు రాష్ట్రమంతా అప్పుల మయం చేశారన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకున్న నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తూ దోపిడీ చేసుకుంటున్నారని మాజీ మంత్రి పొన్నాల విమర్శించారు. పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం మరిచాయన్నారు. YS హయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆంధ్రప్రదేశ్ లోనే అని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని ఏవేవో చెబుతున్నారని, పెన్షన్లపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెపుతోందని మండిపడ్డారు. 13 లక్షల మంది అర్హులు అయితే 10 లక్షలని అంటున్నారని విమర్శించారు.

2014 వరకు పెద్దయెత్తున అభివృద్ధి జరిగినప్పటికీ అభివృద్ధి వ్యయం ఎక్కువగా పెట్టినప్పటికీ… తెలంగాణ రాష్ట్రానికి కేవలం 67 వేల కోట్లు అప్పు ఉండేదని… కానీ ఇప్పుడు నాలుగున్నర లక్షల కోట్లు అప్పు అయ్యిందని పొన్నాల ఆరోపించారు. అన్ని రంగాలను తీర్చిదిద్దిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రాజశేఖర్ రెడ్డి చేసిన కార్యక్రమాలను దేశం మరవలేదన్నారు. వైఎస్ స్పూర్తితో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్