Sunday, January 19, 2025
HomeTrending Newsఅభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ లేదు: సత్య

అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ లేదు: సత్య

గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలుచేయాలని అడుగుతున్న వైఎస్సార్సీపీ… గత చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించిన అమరావతి రాజధానిని ఎందుకు కొనసాగించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిందని , దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. హోదా వల్ల వచ్చే లాభాలను ప్యాకేజీ రూపంలో ఇస్తామన్నా ఎందుకు వద్దంటున్నారని అడిగారు. విజయవాడ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో సత్య కుమార్ మీడియాతో మాట్లాడారు.

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ పడబోదని సత్య స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రం వాటా కింద ఇవ్వాల్సిన నిధులు, స్థలాలు ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ తన పాలనలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేకపోయారని విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిపై విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.  విశాఖ పట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి 2017 రివైజ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం  డీపీఆర్ ను పంపించాల్సి ఉండగా ఇంతవరకూ పంపలేదని, కానీ తాము పంపామని వైసీపీ నిర్లజ్జగా అబద్ధాలు చెబుతోందని,  ఐదేళ్లపాటు కాలయాపన చేశారని ఆయన దుయ్యబట్టారు.

బిజెపికి .5 శాతం ఓట్లు కూడా బిజెపికి రాలేదని చెబుతున్న వైసీపీ నేతలు వారికి151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలుజేశారో గుర్తుపెట్టుకోవాలన్నారు. తమకు ఓట్లు రాకపోయినా మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చేసి, ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్