Monday, May 20, 2024
HomeTrending Newsనేటి నుంచి 'జగన్ కోసం సిద్ధం' పేరిట ప్రచారం: సజ్జల

నేటి నుంచి ‘జగన్ కోసం సిద్ధం’ పేరిట ప్రచారం: సజ్జల

ఎలాగూ అమలు చేసే ఆలోచన లేదు కాబట్టే చంద్రబాబు అలవికాని వాగ్ధానాలు చేశారని, గతంలో ఏం చెప్పారో, ఏవి అమలు చేశారో ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ కొత్తగా చేయగలిగిన వాటినే చెప్పామని స్పష్టం చేశారు. 2014లో రైతు రుణమాఫీ; డ్వాక్రా సంఘాల రుణమాఫీ లాంటి వాటిని బాబు విస్మరించారని గుర్తు చేశారు. బాబు నమ్మితే కొంప కొల్లేరు అవుతుందని, గతంలో రైతులు రుణమాఫీ హామీని నమ్మి వడ్డీలు కట్టకుండా ఎంతో నష్టపోయారని, వారిపై పెనుభారం పడిందని వివరించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. బాబు చెప్పేవి అన్నీ అభాద్దాలు అని ప్రజలందరికీ తెలుసనీ అయినా సరే పదే పదే అబద్ధాలు చెప్పడం ఆయన నైజమని మండిపడ్డారు.

టిడిపి హామీలను ప్రస్తావిస్తూ….యువతకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని చెప్పారని… కానీ ఏ ప్రాతిపదికన ఎంతమందికి ఇస్తారో, ఏయే నిబంధనలు ఉంటాయో చెప్పలేదని… 19 నుంచి 60 ఏళ్ళలోపు మహిళలకు నెలకు 15౦౦ ఇస్తామని చెప్పారని దీనిలో కూడా ఎవరెవరికి అనేది చెప్పలేదని సజ్జల ప్రస్తావించారు.

‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో మరో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు సజ్జల వెల్లడించారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తారని, వాటిలోని కీలక అంశాలతో రూపొదించిన సంక్షేమ పథకాల క్యాలండర్ ను అందజేస్తారని చెప్పారు.  నేటినుంచే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రచారం మొదలుపెడుతున్నామన్నారు.

లబ్దిదారులే తమకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారని జగన్ చెబుతూ వస్తున్నారని… దానిలో భాగంగాలో వివిధ వర్గాలు, వృత్తుల నుంచి కొంతమంది సామాన్య పేదలను తమ ప్రచారకర్తలుగా ఎంపిక చేశామని,, మొత్తం 12 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించామని సజ్జల చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన చల్లా ఈశ్వరి; ఏ. అనంతలక్ష్మీ( రాజమండ్రి సిటీ); పండలనేని శివప్రసాద్ (అవనిగడ్డ); సయ్యద్ అన్వర్ (నెల్లూరు); కటారి జగదీశ్ (అనకాపల్లి) లాంటి సామాన్యులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్