Saturday, January 18, 2025
HomeTrending Newsవైసీపీ ‘సామాజిక న్యాయం’ బస్సు యాత్ర

వైసీపీ ‘సామాజిక న్యాయం’ బస్సు యాత్ర

Bus Yatra: గడప గడపకు మన ప్రభుత్వం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఈ నెలాఖరున  బస్సు యాత్ర కూడా చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ఆయా వర్గాలకు పదవుల పంపకం, మంత్రివర్గ విస్తరణలో ఇచ్చిన అవకాశాలను ప్రజలకు తెలియజెప్పాలని భావిస్తోంది. దీనికోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ తయారు చేశారు. తొలి విడతలో ఈనెల 287,28,29 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, రాజమండ్రి ల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

నిన్న సిఎం జగన్ తో సమావేశమైన మంత్రులు, పార్టీ నేతలు దీనిపై చర్చించారు, నేడు దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించారు.  దీనికి సామాజిక న్యాయం బస్సు యాత్ర అని పేరు పెట్టారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్