Sunday, January 19, 2025
HomeTrending Newsపాకిస్తాన్ లో పట్టు కోసం చైనా పాట్లు

పాకిస్తాన్ లో పట్టు కోసం చైనా పాట్లు

చైనా  PLA సైన్యం బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కోసం రహస్య క్షిపణి బంకర్‌ను నిర్మిస్తోంది. పర్వతాల్లో గుహను తయారు చేసి మిస్సైల్ షెల్టర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్మాణం సింధ్‌లోని నవాబ్‌షా, బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ సమీపంలో ఈ వ్యవహారం వేగంగా జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్వతాలలో ఇటువంటి బంకర్‌లను తయారు చేయడం ద్వారా ‘సహజ రక్షణ’ లభిస్తుంది. ఇంటెలిజెన్స్ క్షిపణి స్థావరం ఉందని పై నుంచి గుర్తించడం కష్టం. రెండవది వైమానిక దాడి జరిగితే, పర్వత గుహలో దాచిపెట్టిన క్షిపణులు, మందుగుండు సామగ్రికి తక్కువ నష్టం వాటిల్లుతుంది. పర్వతాలలో బంకర్లను నిర్మించడం వల్ల ఇతర దేశాల ఉపగ్రహాలకు ఆ సమాచారం లభించదు. ఈ విధంగా, ‘మౌంటైన్ కేవ్’ బంకర్ మరొక విశేషం ఏమిటంటే, వాటిని నిర్మించడం కూడా చాలా సులభం. టన్నెలింగ్ ప్రారంభించిన తర్వాత పర్వతాలలో చాలా దూరం వరకు పని ప్రశాంతంగా చేసుకోవచ్చు.

పాకిస్తాన్ క్షిపణుల ఆయుధాలను పెంచడంలో నిమగ్నమై ఉంది. వీటిలో అణు క్షిపణులు కూడా పెంచుకుంటోంది. అటువంటి పరిస్థితిలో, వాటిని ప్రపంచం దృష్టికి దూరంగా ఉంచడం ఇప్పుడు పాకిస్తాన్ కూడా చాలా అవసం. గ్వాదర్‌లో బలూచ్ తిరుగుబాటుదారుల తిరుగుబాటు కారణంగా చైనా తన ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఇప్పుడు వ్యూహాత్మక బలాన్ని పెంచుకోవడంలో చైనా నిమగ్నమై ఉంది. బలూచిస్థాన్‌తో పాటు, పీఓకే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్ సైన్యం కోసం చైనా సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో నిమగ్నమై ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఇటీవల PLAకి చెందిన 10-12 మంది చైనా సైనికులు పీఓకేలోని శారదా ఆర్మీ క్యాంప్ (40 ఫ్రాంటియర్ ఫోర్స్) వద్ద భూగర్భ బంకర్లను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు.

పీఓకేలోని కెల్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫుల్వామా క్యాంపులో చైనా ఆర్మీ ఇంజనీర్లు భూగర్భ బంకర్లను సిద్ధం చేస్తున్నారు. అయితే, CPEC సాకుతో, చైనా కూడా పాకిస్తాన్‌ను అప్పుల కిందకు క్రమంగా స్వాధీనం చేసుకుంటుందని నిపుణుల అభిప్రాయం. విశ్లేషకుల అంచనా ప్రకారం జిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుండి బలూచిస్తాన్‌లోని గ్వాదర్ వరకు CPEC నిర్మాణం పనిలో జాప్యం కారణంగా దీని ప్రాధాన్యత దాదాపుగా ముగిసేలా కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, చైనా  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) లో అత్యంత ముఖ్యమైన భాగం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC), ఇది చాలా ఉత్సాహంతో ప్రారంభమైనా ఇప్పుడు దాని వేగం మందగించింది. ఇప్పుడు సిపెక్ అథారిటీనే రద్దు చేసేందుకు పాకిస్తాన్‌ సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బలోచిస్తాన్, సింద్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో చైనీయుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

Also Read : చైనా దూకుడు.. తైవాన్ వార్నింగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్