Saturday, November 23, 2024
HomeTrending Newsపోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం: సిఎం హామీ

పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం: సిఎం హామీ

పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే 6511 పోలీసు సిబ్బంది నియామకానికి  అనుమతి మంజూరు చేశామన్నారు. వీటితో పాటు చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ దళాలు ఏర్పాటు చేయబోతున్నమన్నారు.   పోలీసులపై పని ఒత్తిడి తగ్గించేదుకు కట్టుబడి ఉన్నామన్నారు.   రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  పోలీసు సిబ్బంది నియామకాల్లో హోం గార్డులకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.  మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ  16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించామని గుర్తు చేశారు.  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సిఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత,  ఇన్ ఛార్జ్ సిఎస్ విజయానంద్,  డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  సిఎం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాది కాలంగా 261 పోలీసులు అమరులైతే, రాష్ట్రానికి చెందిన వారు 11మంది ఉన్నారన్నారు. వీరిలో ముగ్గురు కోవిడ్ సంబంధిత సమస్యలతో మృతి చెందారని తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం భరోసా ఇచ్చారు.

విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సిఎం, హోంమంత్రి , అధికారులు నివాళులర్పించారు. “అమరులు వారు” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన  సిఎం ఆవిష్కరించారు.

Also Read : పోలీసు నియామకాలకు సిఎం గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్