Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తర్వాత దసరా. ఇది నిజమా..?

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తర్వాత దసరా. ఇది నిజమా..?

నాని లేటెస్ట్ మూవీ ‘దసరా’.  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఫస్ట్ లుక్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. అలాగే ఫస్ట్ టైమ్ నాని కెరీర్ లో 65 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. నాని పై ఇంత బడ్జెట్టా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 30న దసరా మూవీని భారీగా విడుదల చేయనున్నారు.

దసరా టీజర్ ను దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఇందులో నాని.. లుంగీ కట్టుకొని మాసిపోయిన గెడ్డంతో బొగ్గు గనుల్లో మునిగితేలినట్లుగా చాలా కొత్తగా కనిపించాడు. విజువల్స్, నేపధ్య సంగీతం, నానీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా వున్నాయి. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాటలు దసరా సినిమా పై అతనికి వున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి.

“దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. తెలుగు సినిమా గురించి నా సహకారం ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుంచి ఇస్తున్న సహకారం… శ్రీకాంత్ ఓదెల.  అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుంచి ఆర్ఆర్ఆర్, కన్నడ నుంచి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి దసరా వస్తోంది”  అన్నాడు నాని.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రేంజ్ సక్సెస్ దసరా సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

Also Read : రాజమౌళి రిలీజ్ చేసిన ‘దసరా’ టీజర్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్