Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅయోమయం చదువులు

అయోమయం చదువులు

Education-Employment:
విద్య నిగూఢ  గుప్తమగు విత్తము; రూపము పురుషాలికిన్

విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లెదిలన్
విద్య న్రుపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

విద్యే సర్వసం… విద్య లేని వాడు చచ్చినవాడితో సమానం. అని దీని భావం.  మరి మనం నేర్చుకుంటున్న విద్య ఏమిటి?  విద్య నేర్చినా చచ్చిన వాడిలా ఎందుకు బ్రతుకుతున్నాం?

కోటి విద్యలు కూటి కొరకే కదా!.. మనం చదువు’కొని’ నేర్చుకొంటున్న విద్య ఎందుకు?
చదివి, ఏదో ఒక ఉద్యోగం, దాని ద్వారా నాలుగు రూపాయల సంపాదించి.. కడుపు నింపుకోవడానికే.
నాలుగు రూపాయలు సంపాదించడానికి ఏ చదువు చదవాలి?
ఎక్కడ చదవాలి?  ఎంత చదవాలి?.. ఇవన్నీ ఎవరికి వారు సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలే.

స్వాతంత్రం వచ్చిన తరువాత,  ప్రజలందరినీ అక్షరరాస్యులను చేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి
ఏదో ఒకటి చదవాలని జనం కూడా నిర్ణయించేసుకున్నారు.
విరివిగా ప్రభుత్వ బడులు, కళాశాలలు వెలిశాయి.
వెనకబడ్డ కులాల వారికి, దళితులకు, గిరిజనులకు అంటూ ప్రత్యేక పాఠశాలలు ఏర్పడ్డాయి.
జనానికి మాంచి ‘సేవ’ చేయెచ్చని కొన్ని ‘ఎయిడెడ్’ సంస్థలు రంగంలోకి వచ్చాయి.
ఇక పుట్టిన ప్రతివాడు తప్పనిసరిగా చదివేస్తుండడంతో.. ఇదేదో “మంచి వ్యాపారం” లాగా ఉందని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా పుట్టుకొచ్చాయి.

ఇక సేవ, వ్యాపారం అయ్యాక.. చెప్పేదేముంది?
చదువుకోవడం కాస్త చదువు ‘కొనడం’ అయికూర్చుంది.
ప్రైవేటు విద్యాసంస్థలు తామరతంపరగా, కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి.
బడులు, కళాశాలలు అటుంచి… కొత్తగా విశ్వవిద్యాలయాలే అర్ధంతరంగా ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి.
కొత్త కొత్త కోర్సులు.., కొత్త కొత్త డిగ్రీలు.., కొత్త కొత్త చదువులు..
ఏమి, ఎందుకు, ఎలా చదువుతున్నారో.. తెలియకుండా చదివేస్తున్నారు.

Unemployment Issues

తల్లితండ్రులు కూడా కూలి-నాలి చేసో, అప్పో-సప్పో చేసో, ఆస్తులమ్మి – తాకట్టు పెట్టి .. పిల్లల్ని నానా చదువులు చదివిస్తున్నారు.
వీటితోపాటు బ్యాంకులు కూడా ముందుకు వచ్చి ‘అప్పులు’ ఇచ్చి మరీ చదివిస్తున్నాయి.
జనాలు కూడా  చదివీ, చదివీ..  డిగ్రీలు, డిప్లొమాలు, డాక్టరేట్లు..  ఫస్ట్ క్లాసులు, డిస్టింక్షన్లు, నేషనల్ స్కోర్ లు,  ఇంటర్నేషనల్ స్కోర్ లు..  తెగ సంపాదించేస్తున్నారు.
ఆ డిగ్రీలు చేత పట్టుకొని రోడ్డున పడుతున్నారు.

ఇక వారి కష్టాలు మొదలు…
చదవాలని  చెబుతున్న ప్రభుత్వాలు గానీ…
విద్యను వ్యాపారం చేసి జనాన్ని దోచేస్తున్న ప్రైవేటు సంస్థలు గానీ….
‘చదువుకు తగ్గ పని’ కల్పించడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి.
కేవలం పరిమిత సంస్థలు మాత్రమే తమ విద్యార్ధులకు ప్లేస్ మెంట్లు ఇప్పిస్తున్నాయి.
మిగిలిన సంస్థలన్నీ చదువు చెప్ప్రపడంతోనే వదిలేస్యతున్త్నింనాయి.

దాంతో ఇక్కడ అంత చదువూ చదివి..
కొంతమంది పై చదువులనో, ఉద్యోగమనో.. విదేశాల బాట పడుతున్నారు.
మిగిలిన వారిలో కేవలం కొంతమందికి మాత్రమే చదువుకు తగ్గ పని ఇక్కడ దొరుకుతోంది.
ఆస్తులు కరిగించి చదివి.. ఆ డిగ్రీలు పట్టుకొని, రోడ్డున పడుతున్నవారి పరిస్థితి ఘోరం.

నిరుద్యోగులు ఎక్కడైనా, ఏదైనా ‘చిన్న’ ఉద్యోగ అవకాశం ఉందని తెలిస్తే చాలు, రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు.
అందులో అది ప్రభుత్వ ఉద్యోగమైతే… ఆరునూరైనా, నూరుఆరైనా.. సాధించాలని చూస్తున్నారు.
మా ఉద్యోగానికి ఏడో తరగతి చాలన్నా వినకుండా…  డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డి లు చేసినవారు సైతం..
మేము చదివింది ఏడే.. ఏడంటే నిజంగా ఏడే.. ఒట్టు అని అబద్ధం కూడా ఆడేస్తున్నారు.
దానికి తగ్గట్లు దొంగ ఆధారాలు సృష్టించేస్తున్నారు!!

ఏడు చదివినవాడు చేసే పని.. మేము చేయలేమా? అని నిగ్గదీస్తున్నారు కూడా.
ఏమీ చదవనివాడి పని, ఏడు చదివినవాడి పని, పది చదివినవాడి పని కూడా మేమే చేస్తామని.. డిగ్రీలు, పీజీలు చేసిన వారంటే..
మరి మేము ఏమి చేయాలనీ ఏడు వరకే చదివినవారు ప్రశ్నిస్తున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి?
నిజంగా మనం ఏమి చదువుతున్నాం? ఎందుకు చదువుతున్నాం?
విద్య నేర్చి కూడా చచ్చిన వాడిలా ఎందుకు బ్రతుకుతున్నాం?
ఇది చెప్పడానికి “చదువులలో మర్మమెల్ల చదివిన” ప్రహ్లాదుడు రావాలేమో!!

– శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

ఐ ఐ టి విద్యార్థి ఆత్మహత్య

Also Read :

నారాయణ చైతన్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్