Sunday, January 19, 2025
HomeTrending Newsపవన్ కు చంద్రబాబు సంఘీభావం

పవన్ కు చంద్రబాబు సంఘీభావం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.  విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్ కు బాబు సంఘీ భావం తెలిపారు.

నేటి మధ్యాహ్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం, బిజెపి ఇంతవరకూ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, ఇకపై తాను వేచి చూడడం కుదరదని కూడా పవన్ వ్యాఖ్యలు చేశారు. తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు.  ఇలా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే పవన్ తో బాబు సమావేశం కావడం రాజకీయంగా సంచలనం రేకెత్తించింది.  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపి కలిసి పోటీ చేస్తాయన్న వార్తలకు ఈ  భేటీ బలం చేకూర్చింది.

2019 ఎన్నికల తర్వాత పవన్ తో బాబు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్