Wednesday, February 12, 2025
Homeస్పోర్ట్స్India Vs New Zealand: తొలి టి వర్షార్పణం

India Vs New Zealand: తొలి టి వర్షార్పణం

No Toss: ఇండియా-న్యూ జిలాండ్ మధ్య నేడు వెల్లింగ్టన్ లో జరగాల్సిన టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. నిన్న మొన్న భారీ వర్షాలు కురిశాయి, నేటి ఉదయం  కూడా తేలికపాటు జల్లులు పడడంతో మ్యాచ్  నిర్వహణ కష్టతరంగా మారింది. నిరంతరాయంగా వాన పడుతూ ఉండడంతో రద్దు నిర్ణయం మ్యాచ్ అధికారులు ప్రకటించారు.

మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం ఇండియా జట్టు న్యూ జిలాండ్ లో పర్యటిస్తోంది. రోహిత్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా టి20, శిఖర్ ధావన్ వన్డే జట్లకు నేతృత్వం వహిస్తున్నారు.

రెండో టి20 ఆదివారం మాంగ్ నూయీ బే ఓవల్ మైదానంలో జరగనుంది. చివరి మ్యాచ్ నేపియర్ లోని మెక్ లీన్ స్టేడియంలో 22న మంగళవారం జరుగుతుంది.

నవంబర్ 25, 27, 30 తేదీల్లో  ఆక్లాండ్, హామిల్టన్, క్రైస్ట్ చర్చ్ ల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

Also Read:  ICC Men’s T20 World Cup 2022: ‘సూర్య’ ప్రతాపం: ఇంగ్లాండ్ తో ఇండియా సెమీస్ పోరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్