Sunday, January 19, 2025
Homeసినిమా‘పుష్ప’ నుంచి మ‌రో సాంగ్

‘పుష్ప’ నుంచి మ‌రో సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ గా న‌టిస్తుంటే.. ర‌ష్మిక ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టిస్తుంది. ఈ మూవీ టీజ‌ర్, పాటలకు ప్రేక్షకుల నుంచి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈభారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు పాట‌ల‌ను రిలీజ్ చేశారు. ఈ మూడు పాట‌లు ఒక‌ పాట‌కు మించి మ‌రో పాట విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. రికార్డు వ్యూస్ తో దూసుకెళుతూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో పాట‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సాగే పాట‌ను న‌వంబ‌ర్ 19న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్ర‌క‌టించింది. మ‌రి.. ఈ పాట ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్