రాష్ట్రంలో ప్రజలు సంయమనం పాటించాలని డిజిపి గౌతమ్ సావాంగ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలకు ఆవేశాలకు గురి కావొద్దని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన వ్యాఖ్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఎవరూ దాడులకు పాల్పడవద్దని, దాడులకు పాల్పడితే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలను మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.