Sunday, February 23, 2025
HomeTrending Newsపియూష్ తో మేకపాటి భేటి

పియూష్ తో మేకపాటి భేటి

Mekapati Gowtham Reddy Met Piyush Goel In Delhi : 

విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో ఏర్పాటైన మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ ని ఆహ్వానించారు. మేకపాటి ఢిల్లీలో పియూష్ ను కలుసుకున్నారు. పీఎల్‌ఐ స్కీం కింద దేశంలో ఏర్పాటు చేయనున్న మూడు విద్యుత్‌ ఉపకరణాల జోన్లల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయాలని మేకపాటి కోరారు.  భారీ విద్యుత్‌ ఉపకరణాల జోన్‌గా మన్నవరం అనుకూలంగా ఉంటుందని చెప్పారు.

గతంలో ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించిన 750 ఎకరాల భూమిని ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ గా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల జోన్‌పై త్వరలో ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని పీయూష్ అభినందించారు. కొప్పర్తిలో భారీ టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మేకపాటి.

విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని మేకపాటి విన్నవించారు. గతిశక్తిలో ఏపీ భాగస్వామ్యం అవడం ద్వారా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ వెల్లడించారు. మేకపాటి వెంట ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు ఉన్నారు.

Also Read : సిఎంతో నేవీ అధికారుల భేటి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్