Monday, February 24, 2025
HomeTrending Newsక్రిమిలేయర్ తో ఓబిసి లకు నష్టం

క్రిమిలేయర్ తో ఓబిసి లకు నష్టం

Damage To Obcs With creamy layer :

కేంద్ర ప్రభుత్వం UPSC లో OBC క్రిమిలేయర్ (సంపన్న శ్రేణి ) పై అవలంబిస్తున్న విధానం విచిత్రంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. క్రీమి లేయర్ (సంపన్న శ్రేణి) అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించని కారణంగా అర్హులైన OBC లకు విద్య, ఉపాది రంగాలలో అన్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని రాష్ట్ర BC కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్  హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఈ రోజు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. దీనిపై రాష్ట్ర BC కమిషన్ సమగ్రమైన నివేదిక రూపొందించి కేంద్రంపై వత్తిడి తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర BC కమిషన్ చైర్మన్  కృష్ణమోహన్ రావుకి సూచించారు. ఈ క్రిమిలేయర్ విధానం వల్ల OBC లకు రాజ్యాంగం లో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు.

వేలాదిమంది OBC విద్యార్థులకు UPSC లో అమలు చేస్తున్నక్రిమిలేయర్ విధానం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టుగా గ్రూప్ – 1, సమాంతర పోస్ట్ లకు ఎంపికైన ఉద్యోగులకు, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారికి, వృత్తి, వ్యాపార రంగాలలో ఉండి 8 లక్షల రూపాయలు, ఆపైన ఆదాయం గల  కుటుంబాల వారికి ఈ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని నిబంధనలు చెప్తున్నా.., అవి ఎక్కడ అమలు కావడం లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇది OBC  విద్యార్థుల కు గొడ్డలి పెట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లో పని చేస్తున్న ఉద్యోగులు పొందుతున్న వేతనాల పైన,  వారు సాధించిన ప్రమోషన్ ల ఆధారంగా క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయడం దారుణమన్నారు. కింది స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నేడు గణనీయమైన  స్థాయిలో వేతనాలను పెంచడం వల్ల సగటున 8 లక్షల రూపాయల పై వార్షిక వేతనాలను పొందుతున్నార న్నారు. అలాంటి కుటుంబాలకు చెందిన OBC సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు IAS, IPS లాంటి పోస్టులల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ కేటగిరీలో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్థులను రిజర్వేషన్లు జాబితాలోకి తీసుకోవడం దారుణమన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల స్ఫూర్తి కి గొడ్డలి పెట్టున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్రు.

క్రీమి లేయర్ (సంపన్న శ్రేణి) ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించని కారణంగా గత 5, 6 ఏండ్ల నుండి కోర్టులలో పోరాటం చేస్తున్న వారిని , క్రిమిలేయర్ వల్ల నష్టపోయిన వారిని గుర్తించి న్యాయం చేయాలని  ఈ సందర్భంగా బీసీ కమిషన్ ద్వారా కేంద్రం పై వత్తిడి తేవాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో OBC లకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విఘాతమన్నారు. OBC లకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ను పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Also Read : సింగరేణిలో సమ్మె సైరన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్