Vat Reduction On Petrol In Delhi :
అమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీ వాసులను కరుణించింది. పెట్రోలుపై ఎనిమిది శాతం వ్యాట్ తగ్గించింది. దీంతో ఢిల్లీ లో పెట్రోలు ఎనిమిది రూపాయలు తగ్గనుంది. ఇప్పటివరకు 30 శాతం వ్యాట్ రూపంలో పన్ను వసూలు చేస్తుండగా 19.40 శాతానికి తగ్గిస్తూ ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సామాన్యులకు ఇక్కట్లు కలుగుతున్నాయని తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లో 26.8 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 31 శాతం వ్యాట్ రూపంలో పెట్రోలుపై పన్ను వాసులు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను విధించింది. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఇంధన ధరలను తగ్గించేందుకు వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ పంపుల సంఘాలు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంది.
Also Read : ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన