Telangana Government Supports Singareni :
తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు,ఉద్యోగులు,యాజమాన్యానికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో,సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు విస్తరించిన సింగరేణి సుధీర్గ పయనంలో అనేక మైలు రాళ్ళు అధికమించిందని, సింగరేణి పురోగతిలో కార్మికుల పాత్ర కీలకమైనదని కవిత ప్రశంసించారు.
కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దేశంలో లాభాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రప్రభుత్వం కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు.
Also Read : సింగరేణిలో సమ్మె సైరన్