Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజాకవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రజాకవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Goreti Venkanna : ప్రజాకవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను  తెలుగులో సాహిత్యంలో ఎంపిచేశారు. వల్లంకి తాళం సాహిత్యానికి ఈ అవార్డుకు ఎంపికశారు. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ లభించింది. కడియం రచనకు ఈ అవార్డు ప్రకటించారు. బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి ఈ పురస్కారం లభించింది.

పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు కాగా మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ప్రమాణ స్వీకారం చేశాడు.

గోరటి వెంకన్న 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించాడు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడేవాడు.

Goreti Venkanna

రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు.
రచనలు
ఏకనాదం:
రేల పూతలు: ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేలపూతలు ఒకటి

రాజ్యహింస పెరుగుతున్నాదో..
పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో…

అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే “కుబుసం” సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్న కు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సిఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని..మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు.
తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరెటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోశించారని తెలిపారు . గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్