Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్యాషెస్ ఐదో టెస్ట్: ఇంగ్లాండ్ 118 ఆలౌట్

యాషెస్ ఐదో టెస్ట్: ఇంగ్లాండ్ 118 ఆలౌట్

Hobart  Test: యాషెస్ సిరీస్ ఐదో టెస్ట్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 188 పరుగులకే కుప్పకూలింది. హోబార్ట్ లోని బెల్లి రివర్ ఓవల్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 241 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టింది. అలెక్స్ క్యారీ -24; లియాన్-31 పరుగులు చేయడంతో ఆసీస్ 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్ వుడ్ చెరో మూడు; రాబిన్సన్, క్రిస్ ఓక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ వికెట్ల పతనం ఓపెనర్ రోరి బర్న్స్ రనౌట్ తో ప్రారంభమైంది. క్రిస్ ఓక్స్- 36; కెప్టెన్ రూట్ – 34 మాత్రమే రాణించారు. ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ నాలుగు వికెట్లతో రాణించాడు. స్టార్క్ మూడు; బొలాండ్, గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కూడా వెంట వెంట వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 11, మార్నస్ లాబుస్ చేంజ్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి  37 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్-17; స్కాట్ బొలాండ్-5 స్కోరుతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్