Friday, September 20, 2024
HomeTrending Newsతాలిబన్లను మించిన చైనా పాలకులు

తాలిబన్లను మించిన చైనా పాలకులు

Chinese Rulers : టిబెట్ లో చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లను మించిన వేధింపులు టిబెట్ లో సాగుతున్నాయి. టిబెట్ లో ప్రజలను వేధించటంతో పాటు వారి సంస్కృతిని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టు పాలకులు కుట్రలు చేస్తున్నారు. చైనా ప్రస్తుత అధ్యక్షుడు జింపింగ్ పాలనలో మిలిటరీ అరాచకాలు మరింత పెరిగాయి. టిబెట్ రాజధాని లాసాతో పాటు అనేక ప్రాంతాల్లో భౌద్ధ మఠంల కుల్చివేతలతో పాటు వాటిల్లో ఉండే బౌద్ద సన్యాసులను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో టిబెటన్ మొనాస్టరీలను(మఠం) చైనా పాలకులు నేలమట్టం చేస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్ లోని లుహో కౌంటీ లో ఇటీవల 99 అడుగుల బౌద్ద విగ్రహాన్ని చైనా మిలిటరీ కుల్చివేసింది. కుల్చివేతను అడ్డుకున్న వేలమంది టిబెటన్లను అరెస్టు చేసి అక్రమ నిర్భంధం చేశారు. కూల్చివేత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిని, అంతర్జాతీయ మీడియా సంస్థలకు పంపిన వారిని హింసిస్తున్నారు.

మరోవైపు  చైనా సైన్యంలో చేరాలని యువత మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. భారత సరిహద్దుల్లో కొద్ది రోజుల క్రితం తీవ్రస్థాయి తుపానుకు మిలిటరీలో అనేకమంది మృత్యువాత పడ్డారు. గడ్డకట్టే చలి, ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహించటం, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో శత్రువును ఎదుర్కోవటం చైనా సైన్యానికి సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో పర్వత ప్రాంతాల్లో యుద్దవిద్య తెలిసిన టిబెటన్లను మిలిటరీలో చేర్చుకుంటే ఉపయోగకరమని భావించిన కమ్యూనిస్టు పాలకులు టిబెటన్లను బలవంతంగానైనా సైన్యంలోకి తీసుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అక్రమంగా అరెస్టు చేసిన టిబెటన్లను విడుదల చేయాలని, బౌద్ద విగ్రహాల కూల్చివేత ఆపాలని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : బీజింగ్ ఒలింపిక్స్‌ – చైనాకు అగ్నిపరీక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్