Friday, April 26, 2024
HomeTrending Newsఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

Earthquake In The Northeastern States :

ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ రోజు వేకువ జామున 4.30 గంటలకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు సంభవించాయి. అరుణాచల్ ప్రదేశ్లోని బాసర్ కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం కాగా  రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతతో భూకంప తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా మణిపూర్ లో కూడా ఈ రోజు భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లో ఉదయం 7:52 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మిజోరాంలోని న్‌గోపాకు తూర్పు-ఈశాన్యంగా 46కిమీ దూరంలో భూకంప కేంద్ర ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

ఇటీవలి కాలంలో వరసగా భూకంపాలు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కశ్మీర్ లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్