సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయని,మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 20పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు .. కార్యక్రమంలో ఎమ్మేల్యేలు గ్యాధరి కిషోర్, మల్లయ్య యాదవ్, టి ఎస్ ఎం ఐ డి సి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర వైద్యాధికారులు తదితులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వున్నారు….అయిన ఫలితం శున్యం….వారు జిల్లా కు చేసింది ఏమి లేదు.. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీ కోసం చేయని ఆందోళనలు, ధర్నాలు లేవని ఎద్దేవా చేశారు.
చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం కూడా పెద్ద యుద్ధం చేసినా సమైక్య పాలకులు ఏర్పాటు చేయలేదు…… ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో 18 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజల ముంగిటకు వచ్చాయి. వెయ్యి కోట్లతో నల్గొండలో, సూర్యాపేట లో రెండు మెడికల్ కాలేజీలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దాని, నల్గొండలో, సూర్యాపేట లో 1800 పడకల సామర్థ్యం గల అత్యాధునిక ఆసుపత్రి భవనాలను కూడా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు లతో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజీపీ పై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మంత్రి హరీశ్ రావు స్పీచ్ పాయింట్స్…
ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నరు. అసలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు…? ఇవ్వంది ఎవరు..? నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు.. నోటిఫికేషన్లు ఇవ్వనిది ఎవరు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….?
బండి సంజయ్ అండ్ బ్యాచ్ దమ్ముంటే సమాధానం చెప్పాలి.. గాలి మాటలు కాదు..ఉద్యోగాలు ఇస్తే గణాంకాలు చెప్పాలి…మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. నోటికి వచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుందా.. నోటిఫికేషన్లు ఇచ్చినట్లు అవుతుందా. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుందో బండి సంజయ్ తెలుసుకోవాలి…
హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు.. బండి సంజయ్…ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయు..దమ్ముంటే. తెలంగాణ ఏర్పాటు తర్వాత నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగరేణి, గురుకులాలు, విద్యుత్, మెడికల్ హెల్త్ తదితర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 50 నుంచి 60వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్నప్పటి నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకే వంద శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకువచ్చారు. దీనికి గాను 317 జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయితే దీని ప్రకారం, కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ఉంది.
అయితే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతున్నది. తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నది. మీ ప్రభుత్వం హయాంలో… రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ తో, రాష్ట్రపతి నిబంధనలకు లోబడి జీఓ నెంబర్ 317 వచ్చింది. అలాంటి దానిపై బిజెపి నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, విమర్శలు చేయడమే.
తెలంగాణ జనాభాలో 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బీహార్ లో 0.3 %, యూపీ లో 1%, బెంగాల్ 1.1%, గుజరాత్ 1.1 %, కర్ణాటక 1.2%, తమిళనాడు 2% జనాభా ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్నారు. అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని ఈ గణాంకాలు చెప్తున్నాయి.
కేంద్రం విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా.
కేంద్రం చర్యలతో ఉద్యోగాలకు ఎసరు రావడంతో పాటు sc, st, obc, ews అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరగతుల సాధికారత కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికి, అన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తున్నది.
వాస్తవాలన్నీ ఇలా ఉంటే… మీరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దివలాకోరు మాటలను బీజెపీ నేతలు ఇకనైనా మానుకోవాలి. తెలంగాణ ప్రజలారా ఇలాంటి వాళ్ల గోబెల్స్ ప్రచారాన్ని, వాట్సప్ ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.