మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని TSఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని, మొదట రెండంకెల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం 7వందలకు పెరిగిందన్నారు. గత ఏడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామని ఈ రోజు హైదరాబాద్ బస్సు భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. గత ఏడాది 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్స్ రన్ చేశామని, మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని సజ్జనార్ తెలిపారు. గత ఏడాది 30 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు.
ఈ సారి 3845 బస్సులు నడపాలని- 51 పాయింట్స్ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామని, 30మంది ప్రయాణికులు ఉంటే ఈ నంబర్ 04030102829 కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ప్రజలందరూ మా వెబ్ సైట్‌ను చూస్తే అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, ఇప్పటి వరకూ 5వందల బస్సులు 12వందల ప్రయాణికులను మేడారం చేర్చామని సజ్జనార్ వెల్లడించారు.