Earthquake Guatemala :గ్వాటెమాలా దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై దాని తీవ్రత 6.1 గా నమోదైంది. రాజధాని గ్వాటెమాలా నగరానికి నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా సిస్మోలోజి కేంద్రం ప్రకటించింది. కోస్తా తీరంలోని ఎస్క్వింట్ల జిల్లాలో సంభవించిన భూకంపంతో ఆస్థి, ప్రాణ నష్టం ఏ స్థాయిలో జరిగింది తెలియరాలేదు.
భూకంప తీవ్రతకు సమీప ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా, విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. రాజధాని గ్వాటెమాలా కు దగ్గరలోని మిక్ష్కొ, చిమల్తేనేగో తదితర ప్రాంతాల్లో నివాస ప్రాంతలపై అధిక ప్రభావం చూపింది. చాల చోట్ల ఇళ్ళు కూలిపోవటం, పగుళ్ళు రావటం జరిగింది. పర్యాటక ప్రాంతమైన ఆంటిగ్వాలో రోడ్లు దెబ్బతిని టూరిస్టులు ఎక్కడిక్కడే చిక్కుకుపోయారు. రేస్క్యు బృందాలు పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
భౌగోళికంగా మధ్య అమెరికాలో ఉన్న గ్వాటెమాలా దేశం భూకంప తీవ్రతకు అధిక అవకాశాలు ఉన్న ప్రాంతంలో ఉంది. భూమి అధిక ఒత్తిడికి లోనయ్యే మూడు పలకలు కేంద్రీకృతం అయ్యే చోట గ్వాటెమాలా దేశం ఉండటం వాళ్ళ ఇక్కడ భుప్రకంపణలు నిత్యకృత్యం. పోయిన ఏడాది 125 భూకంపాలు సంభవించగా ఒక్క ప్రాణనష్టం కూడా సంభవించ లేదు.