కొండ చరియలు విరిగి పడటంతో రిషికేశ్ – గంగోత్రి మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర కాశి జిల్లా సునగడ్ దగ్గర జరిగిన ఈ ఘటనలో భారీ స్థాయిలో బండరాళ్ళు, మట్టి రోడ్డును ఆక్రమించాయి. దీంతో గంగోత్రి తో పాటు ఆ మార్గంలో ఉన్న 15 గ్రామాల రవాణ సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది.
రోడ్డుపై శిథిలాలను తొలగించి జాతీయ రహదారిని పునరుద్దరించేందుకు సరిహద్దు రహదారుల సంస్థ రంగంలోకి దిగింది. చైనా సరిహద్దులకు వెళ్ళే నేషనల్ హైవే కావటంతో యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రేయింబవళ్ళు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమైంది. బుధవారానికి రోడ్డు తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలకు మే 29వ తేదిన కూడా ఈ రోడ్డు మూత పడింది.