Stand Up Rahul: హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈనెల 18న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “ఈ కథను దర్శకుడు శాంటో నాకు నాలుగు గంటల పాటు చెప్పాడు. ప్రతిదీ డిటైల్‌గా వివరించాడు. వెంటనే మరునిముషంలో చేస్తానని చెప్పాను కానీ.. నా పై ఆయనకు నమ్మకం కలగలేదు. నేను చేస్తానన్నానుగదా! అని అంటే, కాదు. ఆడిషన్ కావాలి అన్నాడు. అలా ఆడిషన్ చేశాక ఆయనకు నా పై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా మా రెండేళ్ళ జర్నీ. స్టాండప్ రాహుల్ అంటే అలరించే కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. ఇటువంటి కాన్సెప్ట్‌ను కొద్దిగా ఇటీవలే పూజాహెగ్డే ఓ సినిమాలో చేసింది. అది మా సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పగలను”
“దానికి మించి కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా మా సినిమాలో వుంటుంది. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వర్ష పాత్ర చాలా క్యూట్ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేది ఇందులో దర్శకుడు బాగా డీల్ చేశారు. ఇటువంటి సినిమా ఇంతకు ముందు రాలేదు. చిత్ర నిర్మాతలు కరోనా వచ్చి మధ్యలో ఆగిపోయినా చాలా నమ్మకంతో ఈ సినిమాకు ఎంత మేరకు కావాలో అన్ని సౌకర్యాలు కల్పించారు. దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకముంది. థియేటర్లోనే సినిమాను చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయద్దు” అని అన్నారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ “ఈ చిత్రం నాకే కాదు అందరికీ మంచి గుర్తింపు తెస్తుంది. కరోనా టైంలో అందరూ ఒత్తిడికి గురయ్యాం. ఆ టైంలో చక్కటి ఎంటర్‌టైన్ మెంట్ కోసం చూశాం. ఇలాంటి సినిమా చూస్తే మనకు రిలీప్ వుంటుంది. థియేటర్లో సినిమాను చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటకు వస్తారనే నమ్మకం నాకుంద”ని అన్నారు.