Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్అశ్విన్ మ్యాచ్ విన్నర్ కాగలడు : మాంటీ పనేసర్

అశ్విన్ మ్యాచ్ విన్నర్ కాగలడు : మాంటీ పనేసర్

వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మ్యాచ్ ఫలితంపై విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. విజేత ఎవరు, పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఎవరు రాణిస్తారో క్రికెట్ పండితులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు వెల్లడిస్తున్నారు. పటిష్టమైన పేస్ బౌలింగ్ భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అనుకుంటుంటే స్పిన్ బౌలింగ్ ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ భారత్ కు మ్యాచ్ విన్నర్ అవుతారని ఇంగ్లాండ్ జట్టు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

న్యూ జిలాండ్ పటిష్టమైన జట్టేనని, కాన్వే ఇటీవలి ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో బాగా రాణించారని, అయితే ఆ జట్టులో లెఫ్ట్ హ్యాండెడ్ బాట్స్ మెన్ ఉన్నారని వారిని అశ్విన్ తన పదునైన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టగలడని పనేసర్ అభిప్రాయపడ్డాడు.  ఇటీవలి కాలంలో న్యూ జిలాండ్ మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తూ వస్తోందని, నెంబర్ వన్ కాగల అర్హత వారికి ఉందని చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ రంజుగా సాగుతుందని, భారత్ కు ఏకపక్షంగా ఉండబోదని మాటీ స్పష్టం చేశాడు. అయితే వాతావరణ పరిస్థితులు, ఎడమ చేతివాటం న్యూ జిలాండ్ ఆటగాళ్ళు కారణంగా రవిచంద్రన్ భారత్ తరఫున మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయని చెప్పాడు.

అశ్విన్ తన బంతితో ఎడమ చేతి వాటం ఆటగాళ్ళను త్వరగా పెవిలియన్ కు పంపితే న్యూజిలాండ్ కష్టాల్లో పడడం ఖాయమని వెల్లడించాడు.  ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటనలో చూపిన నైపుణ్యం మరోసారి అశ్విన్ ప్రదర్శిస్తే, భారత పేస్ బౌలర్ల పై ఒత్తిడి తగ్గుతుందని, అప్పుడు భారత్ పైచేయి సాధిస్తుందని విశ్లేషించాడు పనేసర్.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో బంతి టర్న్ అవుతుందని, భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మంచిదని, జడేజా-అశ్విన్ స్పిన్ జోడీ బాగుందని పనేసర్ సూచించాడు. ఐదో రోజే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉందని, మూడు నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ఫలితం తెలకపోవచ్చని అన్నాడు.  ప్రపంచంలో రెండు గొప్ప జట్లు  తలలపడతాయి కాబట్టి  టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మూడు మ్యాచ్ ల సిరీస్ ఉంటే బాగుంటుందని పనేసర్ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్