Saturday, November 23, 2024
HomeTrending Newsకాసేపట్లో ‘పేట’కు సిఎం: వాలంటీర్లకు సత్కారం

కాసేపట్లో ‘పేట’కు సిఎం: వాలంటీర్లకు సత్కారం

Felicitation: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు.  గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వరసగా రెండో ఏడాది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తూ ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఈ సత్కార కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మందికి రూ. 258.74 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిగా అందించనుంది.

గత సంవత్సరం అందించిన రూ. 226.7 కోట్లతో కలిపి నగదు బహుమతితో కలిపి రెండేళ్ళలో మొత్తం రూ. 485.44 కోట్లు ఖర్చు చేసింది.  ఈరోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందిస్తోంది.

సేవా వజ్ర:
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డుల ప్రధానం

సేవా రత్న:
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున మొత్తంగా 4,136 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డుల ప్రధానం

సేవా మిత్ర:
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా 2,28,322 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుల ప్రధానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్