పాకిస్థాన్ లో కేంద్రీయ అత్యున్నత సర్వీసుకు మొదటిసారిగా ఓ హిందూ యువతి ఎంపికైంది. సింద్ రాష్ట్రంలోని షికార్ పూర్ జిల్లా చక్ అనే మారుమూల గ్రామానికి చెందిన సన రాంచంద్ కరాచీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (CSS)కు ఈ ఏడాది 18,553 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ కు ఎంపికైన 221 మంది సన రాంచంద్ ఒకరు. మంచి స్కోర్ సాధించటంతో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (PAS)కు సన సెలెక్ట్ అయింది. భారత్ లో ఐఎఎస్ మాదిరిగానే పాక్ లో పిఎఎస్.
పాకిస్తాన్లోని సింద్ రాష్ట్రంలోనే హిందువులు ఎక్కువగా ఉంటారు. సన రాంచంద్ తల్లిదండ్రులు రాంచంద్ గుల్వాని, సులోచన రాంచంద్ కాగా ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. సోనం రాంచంద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా మరో చెల్లెలు నదిని రాంచంద్ వైద్య విద్య అభ్యసిస్తున్నారు.