Fear Babu: చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శని అంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరు వింటేనే చంద్రబాబుకు భయం అని, వందేళ్ళ ఆ ఎన్టీఆర్ నుంచి ముప్పై ఏళ్ళ ఈ ఎన్టీఆర్ వరకూ.. ఈ ఇద్దరి పేర్లు వింటే బాబుకు నిద్ర పట్టదని నాని విమర్శించారు. బాబు దశమగ్రహం అని నాడు ఎన్టీఆర్ స్వయంగా చెప్పారన్నారు.
తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎప్పుడో సమాధి కట్టారని, అందుకే 23సీట్లకు పరిమితం చేశారని నాని వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే… టిడిపి కార్యకర్తలు, నిక్కర్ బ్యాచ్ తో కలిసి తమ పార్టీ దళిత మంత్రి విశ్వరూప్, వెనుకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళపై దాడులు చేయించారని ఆరోపించారు. పార్టీలేదు, బొక్కా లేదు అన్న పార్టీని అన్న అచ్చెన్నాయుడుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పెట్టుకుని, ఎందుకూ పనికిరాని వాళ్ళతో సిఎం జగన్ ను తిట్టిస్తున్నారని కొడాలి ధ్వజమెత్తారు. జగన్ ను ఉన్మాది అంటూ బాబు అనడంపై నాని తీవ్రంగా స్పందించారు, నీకంటే పెద్ద ఉన్మాది ఎవరుంటారని ప్రశ్నించారు.
ప్రజలు తరిమేసినా బాబుకు బుద్ధి రాలేదని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ఏం చేసినా ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబుకు అయన ఫొటోకు దండ వేసే అర్హత కానీ, మహానాడు నిర్వహించే అర్హత కానీ లేవన్నారు నాని. మహానాడుకు భయపడి వైసీపీ బస్సుయాత్ర పెట్టారంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలు టిడిపి సభకు పోటీగా యాత్ర నిర్వహించాల్సిన ఖర్మ తమకు లేదన్నారు.
Also Read : అది మహానాడు కాదు…: తమ్మినేని