Monday, November 25, 2024
HomeTrending Newsహౌరాలో అల్లర్లు.. 15 దాకా నిషేధాజ్ఞలు

హౌరాలో అల్లర్లు.. 15 దాకా నిషేధాజ్ఞలు

మహ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు జరిగాయి. హౌరా జిల్లాలో కొందరు నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అల్లరిమూకలు ఉలుబెరియాలో బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేశారు. కాగా, శుక్రవారం హౌరాలోని రోడ్లు, రైల్వే ట్రాక్ ను ఆందోళనకారులు బ్లాక్ చేశారు. హౌరా – ఖరగ్ పూర్ రైల్వే మార్గంలోని దాస్ నగర్ రైల్వే స్టేషన్ లో అల్లరిమూకలు ట్రాక్ పైకి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పాంచ్లా బజార్ లో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ప్రస్తుతం హౌరాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. జూన్ 15 దాకా నిషేధాజ్ఞలను అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఇంటర్నెట్ ను 13 దాకా సస్పెండ్ చేశారు. కాగా, విద్వేషానికి ప్రజలంతా ఏకం కావాలని పశ్చిమబెంగాల్ పోలీసులు పిలుపునిచ్చారు. ప్రజలెవరూ అల్లర్లలో భాగం కారాదని, రెచ్చగొట్టే చర్యలకు పూనుకోకూడదని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్