Thursday, May 30, 2024
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: ఇండియాపై బెల్జియం మహిళల గెలుపు

ప్రో లీగ్ హాకీ: ఇండియాపై బెల్జియం మహిళల గెలుపు

FIH Pro-league: ప్రో లీగ్ హాకీలో ఇండియా మహిళలపై బెల్జియం జట్టు విజయం సాధించింది.  బెల్జియం లోని అంట్వేర్ప్ లో జరిగిన ఈ మ్యాచ్ 3వ నిమిషంలోనే బెల్జియం కెప్టెన్ బార్బారా ఫీల్డ్ గోల్ తో బోణీ కొట్టింది. 35 వ నిమిషంలో ఆంబ్రే మరో గోల్ సాధించి ఆధిక్యాన్ని 2-1కి తీసుకెళ్ళింది. ఆట 48వ నిమిషంలో ఇండియా క్రీడాకారిణి లాల్రేమిసియామి ఒక గోల్ చేసినా ఆ తర్వాత మరో గోల్ సాధించడంలో జట్టు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

రేపు ఇదే వేదికగా ఈ రెండు జట్లూ మరోసారి తలపడనున్నాయి. అయితే ఈ ఓటమితో ఇండియాకు టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అర్జెంటీనా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే టైటిల్ విజేతగా అవతరించింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సిఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్