Wednesday, May 8, 2024
HomeTrending Newsరెండో పంటకూ ముందే నీరిస్తాం: బాలశౌరి

రెండో పంటకూ ముందే నీరిస్తాం: బాలశౌరి

Souri Says: ఇచ్చిన మాట ప్రకారం జూన్ 10న కృష్ణా డెల్టా నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల చేసి చూపామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూన్ 10నే విడుదల చేసి చూపామన్నారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నని- బాలశౌరి వర్గాల మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేర్ని నానిపై బాలశౌరి తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలూ ఎలాంటి విమర్శలూ చేసుకోవద్దని తాడేపల్లి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అందుకే నిన్నటి ఘటనపై వ్యాఖ్యానించేందుకు బాలశౌరి నిరాకరించారు. వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుండగా ఆయన వాటిని దాటవేస్తూ డెల్టా గురించి మాట్లాడి మీడియా ప్రతినిధులకు నవ్వులు తెప్పించారు.

పులిచింతలలో, కృష్ణా బ్యారేజ్ లో పుష్కలంగా నీరు ఉందని.. వీటికి తోడు ఐదు టిఎంసి ల సామర్ధ్యంతో పెనమలూరు, మోపిదేవి వద్ద రెండు బ్యారేజ్ లు సిఎం జగన్ నిర్మిస్తున్నారని,  ఇవి కూడా అందుబాటులోకి వస్తే కృష్ణా డెల్టా నీటికి అసలు ఇబ్బందే ఉండదని, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు.  ఈ సారి డెల్టాలో రెండు పంటలు పండుతాయని… రెండో పంటగా అపరాలు, మొక్కజొన్నలు, మినుములు, పెసలు వేసుకోవచ్చని, రెండో పంటగా కూడా వారి వేసుకున్నా ఇబ్బంది లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్