Event Today: యాక్షన్ హీరో గోపీచంద్, యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్ అప్‌డేట్ తెలిపారు దర్శక నిర్మాతలు. జూన్ 12 సాయంత్రం 5 గంటలకు మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్ లలితకళా థియేటర్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గ్లింప్స్ ఆసక్తి పెంచేసింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. మరి.. ఈ సినిమాతో గోపీచంద్ ఆశించిన విజయం సాధిస్తారేమో చూడాలి.