Thursday, November 28, 2024
HomeTrending Newsకబ్జాలకు కేరాఫ్ మంత్రి పువ్వాడ.. షర్మిల విమర్శ

కబ్జాలకు కేరాఫ్ మంత్రి పువ్వాడ.. షర్మిల విమర్శ

Sharmila Allegations : తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని, ఇచ్చిన హామీలన్నీ మోసమేనని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ఉద్యోగాలని మోసం.. నిరుద్యోగ భృతి అని మోసం…రుణమాఫీ అని మోసం..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే అన్నారు. ఖమ్మం టౌన్ బస్టాండ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్ షర్మిల..కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా…కేసీఆర్ కు కనిపించవని మండిపడ్డారు.

దున్నపోతు మీద వానపడినట్లు కేసీఆర్ లో చలనం లేదని, చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఉద్యమ సమయంలో నేను నా ముసలి దానికి పావుసెరు బియ్యం చాలు అన్నారని, ఉద్యమం తప్పా వేరే ధ్యాస లేదు అన్నారని కెసిఆర్ మాటల్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొడుకు,కూతురు,అల్లుడు అందరూ పదవుల్లో రాజాబోగం అనుభవిస్తున్నారని, కేసీఆర్ ఇంట్లో ఇన్ని ఉద్యోగాలు ఉంటే ..ప్రజలు మాత్రం అడుక్కొని తినాలా అన్నారు. త్యాగాలు ఎవరివి…భోగాలు ఎవరివన్నారు.

ఉద్యమంలో గ్రూప్ 1 పరీక్షలు రాయొద్ధని చెప్పిన కేసీఆర్… తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని 8 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇచ్చింది లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. మా పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, ఇప్పుడు 10 వేలు,15 వేలు,20 వేలు అని మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. స్వయంగా కేసీఆర్ పేరు పెట్టి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు…బండ అన్నారు.

ఇదే ఖమ్మం పట్టణం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వేదింపులు తట్టుకోలేక .. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక్కడ నియంత పాలన జరుగుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు. పువ్వాడ అజయ్ కి నిలకడ లేదుని..మొదట సీపీఎం,తర్వాత కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు టీఆరెఎస్ పార్టీ లో దూకాడని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో టీఆరెఎస్ పార్టీ కి వచ్చిన సీట్ ఖమ్మం ఒక్కటేనని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడన్నారు. మంత్రి అయ్యాక…ఆ పదవికి విలువ లేదు..హోదా తెలియదు..హుందా కూడా తెలియదని పువ్వాడ తీరును దుయ్యబట్టారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదన్నారు.

ప్రభుత్వ ఆస్తులు ..ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడని మంత్రి పువ్వడపై వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందన్నారు. రోడ్లను సైతం కబ్జా…కెనాల్ కబ్జా..రైతుల భూములు కబ్జా..అన్ని కబ్జాలే అన్నారు. ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడ కు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందన్నారు. ఖమ్మం లో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ..లేదా బినామీ కంపెనీ లే చేయాలా అని ప్రశ్నించారు. రోడ్లు,కెనాల్,బస్టాండ్ లు,అన్ని ఈయనే చేయాలి. 100 రూపాయల దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఏ కాంట్రాక్ట్ అయినా పువ్వాడ నే చేయాలి. పువ్వాడ ఖమ్మం కి చేసింది ఏమిటి, నాలుగు రోడ్లు కట్టగానే సరిపోతుందా..అన్నారు.

ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి, ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని వైఎస్ షర్మిల అన్నారు. ఆర్టీసీ కార్మికుల బతుకులను రోడ్ల పాలు చేశారన్నారు. కనీసం యూనియన్స్ లేకుండా చేశారని, పువ్వాడ ఒక నికృష్టుడని విమర్శించారు.

పువ్వాడ ఒక దిక్కుమాలిన మంత్రి…ఒక కంత్రి అని పోలీస్ లను పనొల్లులా వాడుకోవడం మొగతనం కాదని వైఎస్ షర్మిల అన్నారు. దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవి తో మేలు చెయ్యి అని హితవు పలికారు. పువ్వాడ అజయ్ కున్న పేరు…గుండా…రౌడీ షీటర్… దొంగ..ఒక బ్లాక్ మెయిలర్ అన్నారు. అయినా యధా లీడర్… తథా క్యాడర్.. కేసీఆర్ లెక్కనే ఆయన మంత్రులు.. పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కేసీఆర్ అండ్ కో పరిస్థితి అన్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్పా కేసీఆర్ కు ఎం చేతనయ్యింది. లక్షల కోట్లు అప్పులు తేవడం…రాష్ట్రంలో ప్రభుత్వం భూములు అమ్ముకోవడం..ఇదే తెలుసు. 16 మంది ముఖ్యమంత్రులు చేయని అప్పులు మొత్తం కేసీఆర్ చేశాడు. 16 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు.

లక్షల కోట్లు అప్పులు చేసినా… పథకాలకు డబ్బులు లేవని ఉద్యమ కారుడు కదా అని పాలన చేతుల్లో పెడితే బంగారు తెలంగాణను బతుకే లేని తెలంగాణగా మార్చారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇది బార్ల తెలంగాణ… బీర్ల తెలంగాణ. టీఆరెఎస్ పార్టీ నాయకులకు…కేసీఆర్ కుటుంబాలకు అయ్యింది బంగారు తెలంగాణ. ప్రశ్నించే ప్రతిపక్షాలు… గుడ్డి గుర్రాలకు పల్లు తోముతున్నాయన్నారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని పులి కడుపున పులే పుడుతుందని వైఎస్ షర్మిల అన్నారు. నా గతం ఇక్కడే…నా బ్రతుకు ఇక్కడేనని ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు ఉందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Also Read : గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీలోక‌ల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకే

RELATED ARTICLES

Most Popular

న్యూస్