Saturday, November 23, 2024
HomeTrending Newsకష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన

కష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన

Carona-Crises: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవరత్నాల అమల్లో వెనక్కు వెళ్లలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సిఎం పదవి నుంచి దిగిపోయే నాటికి లక్షల కోట్ల అప్పులు, దాదాపు 40 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు.. కార్పోరేషన్ ల ద్వారా తీసుకున్న 20 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్ళారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేద్దామంటే వెంటనే కోవిడ్ మొదలైందని గుర్తు చేశారు. ఈ మూడేళ్ళలో ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా, నాన్ దిబిటి కింద దాదాపు 39 వేల కోట్లు ఇచ్చామని వివరించారు. మంగళగిరిలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ ప్లీనరీలో నవరత్నాల అమలుపై జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడారు.

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో కూడా సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు కావాల్సి వస్తే… అందరూ విమానం ఎక్కడానికి భయపడ్డ రోజుల్లో కూడా… సిఎం ఆదేశాల మేరకు విమాన ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకు వచ్చానన్నారు బుగ్గన.  జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చింతపండు మీద టాక్స్ ఎత్తివేసే విషయంలో మన రాష్ట్రం నుంచి ఒత్తిడి తీసుకు వచ్చి రద్దు చేయించామన్నారు. నాపరాళ్ళు, మామిడి పళ్ళ గుజ్జు విషయంలో మన ప్రయత్నాలతో ఇతర రాష్ట్రాలకు కూడా మంచి జరిగిందన్నారు. ‘నేను ఉండి ఉంటే కరోనా వచ్చేదా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బుగ్గన అపహాస్యం చేశారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి అమ్మ ఒడి లాంటి పథకం వద్దు అని చెప్పగలరా అని ప్రశ్నించారు. వాళ్ళు చేయలేని సంక్షేమం తాము చేస్తున్నామన్న కడుపు మంటతో ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని బుగ్గన మందిపడ్డారు. రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం దౌర్భాగ్యమన్నారు. టిడిపి హయాంలో 20 శాతం అప్పులు తెస్తే, తాము తెచ్చిన అప్పుల శాతం 15 గానే ఉందన్నారు. పెట్రోలు ధరల పెంపుపై విమర్శలు చేయడం సరికాదన్నారు, ఢిల్లీ, కోల్ కతా లో కూడా పెట్రో రెట్లు పెరిగాయని దానికి కూడా తామే కారణమా అని టిడిపిని ప్రశ్నించారు. మాట్లాడితే రాజధాని అమరావతి పేరు చెబుతారని వారు ఖర్చు పెట్టింది కేవలం 1777 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని, ఆరోగ్య శ్రీ, మధ్యాహ్న భోజనం, ఫీజు రీఇంబర్స్మెంట్ , ఆశా వర్కర్లు, చివరకు కోడి గుడ్ల కు ఇవ్వాల్సిన బిల్లులు కూడా  పెండింగ్ లో పెట్టారని విమర్శించారు.

Also Read వైఎస్ విజయమ్మ రాజీనామా

RELATED ARTICLES

Most Popular

న్యూస్