Permanent President: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగంలో ఈ మేరకు ప్రతిపాదనలు సవరిస్తూ దాని ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయగా జగన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీనితో ఆయన ఎన్నికను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
దీనితో పాటు యువజన, శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును ‘వైఎస్సార్ కాంగ్రెస్’, వైఎస్సార్సీపీ పేర్లతో పిలిచేలా కూడా పార్టీ రాజ్యాంగంలో తీర్మానం ఆమోదించారు. దీన్ని కూడా పార్టీ ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విజయసాయి ప్రకటన చేసిన వెంటనే పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మద్దతు పలికారు. జగన్ సైతం అభివాదం చేసి కృతజ్ఞత తెలిపారు.