ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని, దశలవారీగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సిఎంసమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని, ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమీక్ష సందర్భంగా సిఎం చేసిన ముఖ్య సూచనలు
విలేజ్ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలి
108, 104 లాంటి సర్వీసుల్లో లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి
ఈ వాహనాలపైన ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంచాలి
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సిఎం ఆరా
ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి
ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపై సీఎం రివ్యూ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ఈ ప్రభుత్వం వచ్చాక భర్తీచేశామన్న అధికారులు
జులై చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలి
ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలి
16 మెడికల్‌కాలేజీల్లోని 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్న అధికారులు.
నర్సీపట్నంలో కూడా ఈనెలాఖరునుంచి పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
మెడికల్ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశం.
ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపి కమిషనర్ వి వినోద్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్(డ్రగ్స్) రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : ప్రతి అంశంపై దృష్టి పెట్టాలి: హౌసింగ్ పై సిఎం