left over: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి వివిధ కారణాలతో లబ్ధి పొందలేని వారికి ప్రభుత్వం నేడు ఆ సహాయాన్ని అందజేయనుంది. ఏ కారణం చేతనైనా అర్హులు సదరు పథకాన్నిపొందలేకపోతే, సంక్షేమ పథకం లబ్ధి అందించిన నెల రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి… డిసెంబర్ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్ మాసంలో, జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్ నెలలో అందించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు లబ్ధిదారుల అకౌంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నేరుగా నిధులు జమ చేయనున్నారు,.
3,39,096 మంది లబ్ధిదారులకు రూ. 137 కోట్ల సాయం అందనుంది. వీటిలో పథకాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద నేడు కొత్తగా 2,99,085 మందికి ఏటా రూ. 935 కోట్ల అదనపు వ్యయంతో కొత్త సామాజిక పెన్షన్లు…కొత్తగా మంజూరు చేస్తున్న 7,051 బియ్యం కార్డులతో కలిపి ఇప్పటివరకు 1,45,47,036 బియ్యం కార్డులు మంజూరు…నేడు కొత్తగా అందిస్తున్న 3,035 డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులతో కలిపి ఇప్పటివరకు 1,41,12,752 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లయింది
Also Read : కష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన