Saturday, May 3, 2025
Homeస్పోర్ట్స్Unity Through Sports: నేషనల్ గేమ్స్ లోగో విడుదల

Unity Through Sports: నేషనల్ గేమ్స్ లోగో విడుదల

నేషనల్ గేమ్స్ లోగో ను నేడు విడుదల చేశారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ లో జరిగిన ఓ  కార్యక్రమంలో ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి  భూపేంద్ర భాయ్ పటేల్ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్- గుజరాత్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.  జాతీయ క్రీడలకు సంబంధించి రెండు అసోసియేషన్ల  మధ్య  ఒప్పందం కూడా కురుదుకున్నారు. ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. లోగోలో వివిధ క్రీడాంశాలను పొందుపరుస్తూ సింహం ఆకారంలో ఒక బొమ్మ, స్టాట్యూ అఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిమ తో కలిపి తయారు చేశారు. ‘క్రీడల ద్వారా ఐక్యత’ అనేది ట్యాగ్ లైన్ గా ఉండబోతోంది.

36 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. గుజరాత్ రాష్ట్రంలోని ఆరు ప్రధాన నగరాలు గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భావ్ నగర్ నగరాల్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నారు.

దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ ఈవెంట్ మన ఐక్యతను ప్రతిబింబిస్తాయని ఒలింపిక్స్ అసోసియేషన్ ధీమాగా ఉంది.

గతంలో  కేరళ రాష్ట్రంలో జరిగిన 35వ జాతీయ క్రీడల్లో 33 క్రీడాంశాలు ఉండగా వాటికి మరో మూడు జత చేసి 36కు పెంచారు. మల్లకంభ, యోగాసన అంశాలు జత చేర్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్