వికారాబాద్ , చేవెళ్ల ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగర జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్(Osmansagar)కు 2400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ ఫ్లో 2442 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ నుంచి ఆరు గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులకు చేరింది.
అటు హిమాయత్ సాగర్(Himayath sagar)కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు సాగర్ నాలుగు గేట్ల ద్వారా మూసిలోకి 1320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులకు చేరింది.