Saturday, September 21, 2024
HomeTrending Newsబలోచిస్తాన్ లో తెగిపోయిన 7 ప్రాజెక్టులు

బలోచిస్తాన్ లో తెగిపోయిన 7 ప్రాజెక్టులు

పాకిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు 7 సాగునీటి ప్రాజెక్టులు తెగిపోయాయి. మిగతా ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాంల గేట్లు ఎట్టి దిగువకు నీటిని వదులుతున్నారు. ఏడు ప్రాజెక్టులు తెగిపోవటంతో కుమ్బర్ శాహ్దకోట్, దాదు జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని కుమ్బార్ శాహ్దకోట్ జిల్లాలోని అనేక గ్రామాలు జలమయం కాగా వరదలకు రోడ్లు తెగిపోయాయి. జిల్లాలోని 70 శాతం గ్రామాలు రాకపోకలు నిలిచి పోయాయి. ఇరాన్ సరిహద్దుల్లోని ఈ జిల్లాలో పర్వతాలు, కొండలు అధికంగా ఉండటంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం కూడా కష్టతరంగా మారింది.

మరోవైపు సింద్ రాష్ట్ర సరిహద్దుల్లోని దాదు జిల్లాలో రోడ్లు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. 50 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జూన్ 20వ  తేది నుంచి ఏకధాటిగా పడుతున్న వానలు బలోచిస్తాన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలు మినహా పట్టణాలు, గ్రామాల్లో మట్టి కట్టడాలే ఎక్కువగా ఉంటాయి. ఎడతెరిపి లేని వర్షాలకు మట్టికట్టడాలు వరదలకు కుప్ప కుళాయి. ఇప్పటివరకు 130 మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస ప్రాంతాలు లేక అనేక మంది పిల్లా పాపలతో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం సహాయా కార్యాక్రమాలు చేస్తున్నామని చెపుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరిని ఆడుకున్న దాఖలాలు లేవు. బలోచిస్తాన్ ప్రజలు మొదటి నుంచి తమది స్వతంత్ర దేశమని పాకిస్తాన్ ఆక్రమించింది అనే కోణంలో 70 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద వాడుకుంటున్నా.. ఇక్కడ అభివృద్ధి చేయటం లేదు. అనేక మంది యువతీ యువకులు తిరుగుబాటు గళం ఎత్తటం, నిరసనలకు దిగటంతో ఎన్ కౌంటర్ల పేరిట బలోచ్ యువతను హతమార్చటం సాధారణంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్